గరుడుడిపై పెంచలస్వామి దర్శనం

ABN , First Publish Date - 2020-12-12T04:37:51+05:30 IST

పెంచలకోన క్షేత్రంలో స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

గరుడుడిపై పెంచలస్వామి దర్శనం
గరుడుడిపై పెంచల స్వామి

రాపూరు, డిసెంబరు 11: పెంచలకోన క్షేత్రంలో  స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీవారికి అభిషేకం చేసి, సుందరంగా అలంకరించారు. కల్యాణమండపంలో శాంతిహోమం నిర్వహించి, శ్రీవారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:37:51+05:30 IST