స్వర్ణభారత్లో మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2020-12-04T03:46:06+05:30 IST
వెంకటాచలం పంచాయతీ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఉన్న స్వర్ణభారతి గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్ధ (సైరెడ్)లో ఈ నెల 16 నుంచి మహిళలకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ తరగతులు

వెంకటాచలం, డిసెంబరు 3 : వెంకటాచలం పంచాయతీ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఉన్న స్వర్ణభారతి గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్ధ (సైరెడ్)లో ఈ నెల 16 నుంచి మహిళలకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సైరెడ్ డైరెక్టర్ జి కృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు టైలరింగ్, వత్రా చిత్రా కళా ఉద్యామి (మగ్గం వర్క్), బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ఈ కోర్సుల కాలపరిమితి 30 రోజులపాటు ఉంటుందని, టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీపార్లర్ కోర్సుల్లో చేరేవారు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినా, తెలుగు చదవటం, రాయడం వచ్చి ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం ఉంటుందన్నారు. కోర్సుల్లో చేరాలనుకునే వారు 4 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డులు, ధ్రువీకరణ పత్రాలు జెరాక్స్ కాపీలు తీసుకుని వెంకటాచలంలోని సైరెడ్ కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. వివరాల కోసం 0861 - 2383555, 94941 33370 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.