అలగానిపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-12T04:01:19+05:30 IST

మండలంలోని అలగానిపాడు పంచాయతీ కార్యదర్శి ఎస్‌.కె. షరీఫ్‌ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

అలగానిపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

విడవలూరు, డిసెంబరు 11: మండలంలోని అలగానిపాడు పంచాయతీ కార్యదర్శి ఎస్‌.కె. షరీఫ్‌ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అలగానిపాడు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న షరీఫ్‌ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో  ముదివర్తి పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో పంచాయతీలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే పోరంబోకు స్థలానికి ఎన్‌వోసీ జారీ చేయడమే కాకుండా ఇంటి పన్నులు వసూలుచేసి, సకాలంలో ట్రెజరీకి జమ చేయలేదు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు అందటంతో ఇటీవల డీఎల్‌పీవో రమేష్‌, ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌ గ్రామంలో విచారణ జరిపి, ఆ నివేదికలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి షరీఫ్‌ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-12-12T04:01:19+05:30 IST