రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-20T05:18:37+05:30 IST

రైలు కిందపడి ఎస్‌.కె. మస్తాన్‌వలి(17) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

కావలి రూరల్‌, నవంబరు 19: రైలు కిందపడి ఎస్‌.కె. మస్తాన్‌వలి(17) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న  ఘటన గురువారం రాత్రి ముసునూరు రాఘవేంద్రస్వామి ఆలయం వెనుక వైపు జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కంభంపాడుకు చెందిన యువకుడిగా గుర్తించా రు. ఇంటర్‌ వరకు చదివిన మస్తాన్‌వలి పట్టణంలోని రెస్టారెంట్‌లో పనికోసం గురువారం ఉదయం స్వగ్రామం నుంచి వచ్చాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరా లేదు. కావలి జీఆర్పీ ఎస్‌ఐ మాలకొండయ్య కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Updated Date - 2020-11-20T05:18:37+05:30 IST