అన్నదాతకు ‘మద్దుతి’వ్వండి!
ABN , First Publish Date - 2020-09-01T06:25:30+05:30 IST
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నెల్లూరు పా

జిల్లావ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసన
నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట)ఆగస్టు 31 : ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.10వేలు ఇచ్చి దళారులు 16 వేలకు బిల్లులు చేసుకుంటున్నారని, నకిలీ సంతకాలు చేస్తూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
అనంతరం కలెక్టరేట్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేంద్రరెడ్డి, కర్నాటి ఆంజనేయులు, రాధాకృష్ణగౌడ్, బుజ్జిరెడ్డి, కోట వెంకటేశ్వర్లు, పెద్దరోశయ్య పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ తన నివాసంలో వరి కంకులను చేతబట్టి నిరసన తెలిపారు.
రైతు సంఘాల ధర్నా
నెల్లూరు(హరనాథపురం) : ఎడగారులో పండిన ధాన్యం మొత్తాన్ని మిల్లర్లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.శ్రీరాములు మాట్లాడుతూ మిల్లర్ల తీరువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రమౌళి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు.