నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

ABN , First Publish Date - 2020-12-12T05:04:23+05:30 IST

మండలంలోని మన్నెముత్తేరి, మంగానెల్లూరు, మన్నారుపోలూరు సబ్‌ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌శాఖ టౌన్‌ ఏఈ రాజుబాబు, రూరల్‌ లైన్‌మన్‌ సురేంద్ర తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

సూళ్లూరుపేట, డిసెంబరు 11 : మండలంలోని మన్నెముత్తేరి, మంగానెల్లూరు, మన్నారుపోలూరు సబ్‌ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌శాఖ  టౌన్‌ ఏఈ రాజుబాబు, రూరల్‌ లైన్‌మన్‌ సురేంద్ర తెలిపారు. మన్నెముత్తేరి పరిధిలోని గ్రామాలతోపాటు సూళ్లూరుపేట పట్టణంలో రైల్వేగేట్‌కు తూర్పువైపున, మన్నారుపోలూరు,  నూకలపాళెం, ఇలుపూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మంగానెల్లూరు సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 

ఓజిలి :  స్థానిక 33కేవీ సబ్‌స్టేషన్‌ మరమ్మతుల కారణంగా ఓజిలితోపాటు మండలంలోని కురుగొండ, ఆరిమేనిపాడు,  వజ్జవారిపాళెం, కరబల్లవోలు, అత్తివరం గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌శాఖ ఏఈ గిరిధర్‌  తెలిపారు. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని తెలిపారు. వ్యవసాయదారులకు  ఉదయం 5  నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5  నుంచి రాత్రి 10 గంటల వరకు సరఫరా ఉంటుందని  తెలిపారు. 


Updated Date - 2020-12-12T05:04:23+05:30 IST