కీచక వైద్యుడిపై సూపరింటెండెంట్‌ విచారణ

ABN , First Publish Date - 2020-03-04T09:51:13+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కీచక వైద్యుడి లైంగిక వేధింపులపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై విచారణ

కీచక వైద్యుడిపై సూపరింటెండెంట్‌ విచారణ

పాల్గొన్న నర్సులు, ఫార్మాడీ విద్యార్థులు

కలెక్టర్‌కు విచారణ నివేదిక  


నెల్లూరు(వైద్యం) మార్చి 3 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కీచక వైద్యుడి లైంగిక వేధింపులపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై విచారణ కోనసాగుతోంది. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం రెండు రోజుల కిందట జేసీ-2 కమలకుమారి విచారణ చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండ్‌ డాక్టర్‌ సాంబశివరావు మంగళవారం. స్టాఫ్‌ నర్సులు, ఫార్మాడీ విద్యార్థులతో ఆయన విచారణ జరిపించారు. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వివిధ వర్గాలను ఆయన విచారించారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా విచారించారు. ఈ విచారణలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారా లేదా అన్న వివరణ ఇవ్వలేదని మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఈ విచారణ నివేదికను సూపరింటెండ్‌ కలెక్టర్‌కు అందజేయనున్నారని తెలిసింది.

Updated Date - 2020-03-04T09:51:13+05:30 IST