శోభాయమానంగా షణ్ముఖుడి కల్యాణం
ABN , First Publish Date - 2020-12-21T04:54:13+05:30 IST
నెల్లూరు శివార్లలోని కనుపర్తిపాడులో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 20 : నెల్లూరు శివార్లలోని కనుపర్తిపాడులో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం సందర్భంగా ఉదయం 108 కలిశాలతో మూలవర్లకు అభిషేకాలు, క్షీర, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. పూలంగి సేవ చేశారు. ఉభయకర్తలుగా తురక సురేష్ - సునీత, ఎడల సతీష్‌కుమార్‌రెడ్డి- రూప, మేనకూరు మురళీరెడ్డి- సుజన వ్యవహరించారు. ఈ వేడుకలను ఆలయ ధర్మకర్త వెందుటి చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు.