అమరావతికి మద్దతుగా దీక్షలు

ABN , First Publish Date - 2020-12-18T03:39:56+05:30 IST

అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

అమరావతికి మద్దతుగా దీక్షలు
నిరసన దీక్షను చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు

గూడూరు, డిసెంబరు 17: అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 365 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఈ  దీక్షలను నిర్వహించామన్నారు. విభజన చట్ట ం ప్రకారం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఢందంగా 33 వేల ఎకరాలను ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి, నరసింహులు, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, ఇశ్రాయిల్‌కుమార్‌, భారతమ్మ, సరస్వతమ్మ, వెంకటేశ్వర్లు, గురవయ్య, శ్రీనివాసులు, బట్టేపాటి కృష్ణయ్య, చంటి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T03:39:56+05:30 IST