ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె

ABN , First Publish Date - 2020-11-27T04:29:26+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి వివి. రమణయ్య డిమాండ్‌ చేశారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె
ర్యాలీ నిర్వహిస్తున్న రైతు కూలీ సంఘం, ఏఐటీయూసీ నాయకులు

వెంకటగిరి(టౌన్‌), నవంబరు 26:  ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి వివి. రమణయ్య డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక విశ్వోదయ జూనియర్‌ కళశాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి కార్మికుల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, భారత్‌ పెట్రోలీయం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రవేటు సంస్థలకు కట్టబెట్టడతున్నారని అన్నారు. అనంతరం ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, సీఐటీయూ నాయకుడు  సీహెచ్‌ ఉదయభాస్కర్‌, చలపతి, చిన ఓబయ్య, స్ర్తీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కే. అజిత తదితరులు పాల్గొన్నారు. 

గూడూరు(రూరల్‌): గూడూరులో ఎన్‌ఎఫ్‌పీఈ నాయకుడు సుధాకర్‌రాజు  మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేఖ విధానాలకు నిరసిస్తూ సమ్మె నిర్వహించామన్నారు. కార్యక్రమంలో గోవిందనాయక్‌, చంద్రశేఖర్‌, సుధాకర్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి :  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పురవీదుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఎస్‌డబ్యూఎఫ్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కార్మికులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విదులను బహిష్కరించారు. 

రాపూరు: రాపూరులోని ఆర్టీసీ కార్మికులు గురువారం సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎర్రబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొని తమ మద్దుతు ప్రకటించారు. 

కోట : కోట మండలంలోని పలు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు గురువారం మూత పడ్డాయి.  ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిర సిస్తూ జిల్లాలోని 300 శాఖల్లో సిబ్బంది హఠాత్తుగా సమ్మెలోకి వెళ్ళిపోయారు. దీంతో  వ్యాపారులు ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

Updated Date - 2020-11-27T04:29:26+05:30 IST