మహిళాసాధికారత దిశగా అడుగులు

ABN , First Publish Date - 2020-09-13T07:20:02+05:30 IST

మహిళాసాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని ఇస్కపాళెంలో మహిళా సదస్సు నిర్వ

మహిళాసాధికారత దిశగా అడుగులు

  కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు


వెంకటాచలం, సెప్టెంబరు 12 : మహిళాసాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని ఇస్కపాళెంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ కొత్తగా మంజూరైన రైస్‌ కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 75 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామన్నారు. సర్వేపల్లి నియోజక వర్గంలో అనేక పరిశ్రమలు రానున్నాయని తెలిపారు.  ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రసంగించారు. చెముడుగుంట, కాకుటూరు, కంటేపల్లి, తిక్కవరప్పాడు, గొలగమూడి, సర్వేపల్లి, ఇస్కపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించారు.


ఇస్కపాళెంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు, ఎంపీడీవో ఏ సరళ, ఐకేపీ ఏరియా కోఆర్డీనేటర్‌ శ్రీనివాసులు, ఏపీఎం అనిల, వైసీపీ నేతలు కోదండరామిరెడ్డి, వెంకటశేషయ్య, సుధాకర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, శివారెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T07:20:02+05:30 IST