భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2020-08-12T10:42:56+05:30 IST
బోగోలు మండలంలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్బంగా చిన్నికృష్ణుని ప్రతిమలను అందంగా అలంకరించి ..

బిట్రగుంట, ఆగస్టు 11: బోగోలు మండలంలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్బంగా చిన్నికృష్ణుని ప్రతిమలను అందంగా అలంకరించి వేడుకలు జరుపుకున్నారు. చెంచులక్ష్మిపురంలో వెలసిన కోదండరామస్వామి ఆలయంలో ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన చిన్ని కృష్ణుడి ప్రతిమ ఆకట్టుకొంది. యాదవపాలెం, బోగోలు ప్రాంతాల్లో చిన్నారుల చిన్నికృష్ణుని వేషధారణ అలరించింది. కొండబిట్రగుంట సంతాన గోపాలకృష్ణుడికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
అలరించిన చిన్నారుల వేషధారణు
బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 11: మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారుల చిన్నికృష్ణుడి వేషధారణలు అలరించాయి. కృష్ణ మందిరాలు భక్తులు లేక అర్చకులు నిర్వహించిన పూజలకే పరిమితమయ్యాయి.
వైభవంగా శ్రీకృష్ణాష్టమి
ఇందుకూరుపేట, ఆగస్టు 11 : మండలంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. పున్నూరు శ్రీకృష్ణ మందిరంలో దేవదేవురులకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. గొల్లపల్లి విజయకుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. సాయంత్రం కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉట్టి మహోత్సవం జరిగింది. రావూరు, ఇందుకూరుపేట, మైపాడు, తదితర గ్రామాల్లో కూడా వేడుకలు నిర్వహించారు.