-
-
Home » Andhra Pradesh » Nellore » sports
-
డిసెంబరు 24న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్
ABN , First Publish Date - 2020-11-22T04:31:26+05:30 IST
మండలంలోని ఓగూరువాండ్లపల్లిలో డిసెంబరు 24వ తేదీన రాష్ట్రస్థాయి గెలాక్సీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జీపీఎల్ కమిటీ చైౖర్మన్ గంధం వెంకటయ్య, కార్యదర్శి సోడా చిన్నపరెడ్డి తెలిపారు.

గోడపత్రిక ఆవిష్కరించిన నిర్వాహకులు
సీతారామపురం, నవంబరు 21: మండలంలోని ఓగూరువాండ్లపల్లిలో డిసెంబరు 24వ తేదీన రాష్ట్రస్థాయి గెలాక్సీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జీపీఎల్ కమిటీ చైౖర్మన్ గంధం వెంకటయ్య, కార్యదర్శి సోడా చిన్నపరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓగూరువాండ్లపల్లిలో గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సహాయార్థం రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 10వ తేదీన సెమీ ఫైనల్ మ్యాచ్, జనవరి 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.25,000, తృతీయ బహుమతి రూ.10,000, మ్యాన్ ఆఫ్ ద సీరీస్ రూ.5,000, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌కు రూ.500 అందిస్తామన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు ఎంట్రీ ఫీజు రూ.3,000 ఈ నెల 30వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7210000672, 7210000762 అను నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హరీ్‌షరెడ్డి, అల్లూరురెడ్డి, మధు, దత్తాత్రేయ, ప్రసాద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.