ధ్యానంతో ఆనందకర జీవితం

ABN , First Publish Date - 2020-12-28T04:49:09+05:30 IST

ధ్యానంతో రోగాలు దరిచేరవని, ఆనందకరమైన జీవనం సాధ్యపడుతుందని సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్‌ బండి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ధ్యానంతో ఆనందకర జీవితం
ర్యాలీలో పాల్గొన్న పిరమిడ్‌ మాస్టర్లు, ధ్యాన సాధకులు

ఆత్మకూరు, డిసెంబరు 27: ధ్యానంతో రోగాలు దరిచేరవని, ఆనందకరమైన జీవనం సాధ్యపడుతుందని సీనియర్‌ పిరమిడ్‌ మాస్టర్‌ బండి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం ఎర్రబల్లి, గండ్లవీడు, బొటికర్లపాడు గ్రామాల్లో వింజమూరు స్పిరిచ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలో మహాకరుణ-శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ధ్యానం చేసే వారు ఆత్మ విజ్ఞాన పుస్తకాలను చదవడం, ధ్యానంలో కలిగే అనుభవాలను సహచరులతో పంచుకోవడం, వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం, శాఖాహారాన్ని భుజించడం తదితర 18 లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పిరమిడ్‌ మాస్టర్లు, ధ్యానసాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:49:09+05:30 IST