నేడు స్పైస్‌ కిచెన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-05T05:20:05+05:30 IST

నెల్లూరులోని ఎం-1 సినిమాస్‌(ఎస్‌-2 థియేటర్స్‌)లో శనివారం నుంచి స్పైస్‌ కిచెన్‌ను నూతన హంగులతో ప్రారంభిస్తున్నామని మాగుంట గ్రూప్‌ ఆఫ్‌ సినిమాస్‌ చైర్మన్‌ మాగుంట సుబ్బరామిరెడ్డి తెలిపారు.

నేడు స్పైస్‌ కిచెన్‌ ప్రారంభం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 4: నెల్లూరులోని ఎం-1 సినిమాస్‌(ఎస్‌-2 థియేటర్స్‌)లో శనివారం నుంచి స్పైస్‌ కిచెన్‌ను నూతన హంగులతో ప్రారంభిస్తున్నామని మాగుంట గ్రూప్‌ ఆఫ్‌ సినిమాస్‌ చైర్మన్‌ మాగుంట సుబ్బరామిరెడ్డి తెలిపారు. నగరంలోని ఎం-1 సినిమాస్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్పైస్‌ కిచెన్‌లో లైవ్‌ కిచెన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. అందులో ఇండియన్‌, ఇటాలియన్‌, చైనీస్‌ వంటకాలు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు లభిస్తాయని చెప్పారు. అలాగే స్పైస్‌ కిచెన్‌లో చాట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని, సాయంత్రం 3 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్‌లో ఇది లభిస్తుందన్నారు. ఈ నెల 25 నుంచి సినిమా థియేటర్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్‌ మేనేజర్‌ వై లీలాప్రసాద్‌, జనరల్‌ మేనేజర్లు హర్షద్‌, శేషు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:20:05+05:30 IST