కోవూరులో మాటల తూటాలు

ABN , First Publish Date - 2020-05-10T07:30:36+05:30 IST

కోవూరు కేంద్రంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య శనివారం మాటల తూటాలు పెరిగాయి.

కోవూరులో మాటల తూటాలు

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ధూం ధాం

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అన్న ప్రసన్న

నీకన్నా ఎవరున్నారంటూ పోలంరెడ్డి ధ్వజం.


నెల్లూరు, మే 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కోవూరు కేంద్రంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య శనివారం మాటల తూటాలు పెరిగాయి. విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి తీవ్ర పదజాలంతో నిందించగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ ప్రసన్నను హెచ్చరించారు. శనివారం వేర్వేరుగా విలేకరులతో ఈ ఇద్దరు నాయకులు మాట్లాడిన మాటలు... 


చంద్రబాబు రాజకీయ వ్యభిచారి : ప్రసన్న

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యభిచారి అని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. కోవూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సందర్భంలో మృతుల కుటుంబాలకు పది లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ బాధితులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తగదన్నారు. చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వమైనా ఇంత నష్టపరిహారం ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న జగన్‌ను చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడటం తగదంటూ తీవ్ర పదజాలంతో  దూషించారు. చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. ఆయన అసలు మనిషే కాదన్నారు. రాయడానికి సాధ్యం కాని భాషలో వ్యాఖ్యానించారు.


నోరు అదుపులో పెట్టుకో : పోలంరెడ్డి

ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నీ భాష మార్చుకో, నోరు అదుపులో పెట్టుకోలేదంటే ప్రజలు నిన్ను క్షమించరు, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డిమాండ్‌ చేస్తే ఆయన్ను నోటికొచ్చినట్లు విమర్శిస్తావా, నీకా నైతిక హక్కు ఎక్కడిది?’’ అని పోలంరెడ్డి ప్రశ్నించారు. ‘‘నీకు రాజ కీయ భిక్ష పెట్టిన నాయకుడు బాబు అన్న విషయాన్ని గుర్తించుకో. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి 15 రోజులు తిరగకముందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకర్ష్‌ పథకానికి అమ్ముడుపోయిన నీకు ఇంకొకరిని విమర్శించే హక్కు ఎక్కడిది? ప్రసన్న కుమార్‌రెడ్డి నలపరెడ్డి వంశంలో నమ్మకద్రోహిగా పుట్టాడు.


అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను కాకా పట్టడం కోసం దిగజారి విమర్శలు చేయడం ప్రసన్నకుమార్‌రెడ్డికి అల వాటే. టీడీపీలో ఉన్న రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని పంచె ఊడేదాకా తన్నండి అన్నది నువ్వు కాదా, జగన్‌మోహన్‌ రెడ్డిని హంతకుడని, దొంగ అని, అవినీతిపరుడని, అవినీతి డబ్బుతోనే సాక్షి పేపరు పెట్టాడని విమర్శించలేదా..!?. ఈ రోజు సీఎం జగన్‌ మె ప్పు కోసం 15 ఏళ్లపాటు  ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబును అసభ్యపదజాలంతో విమర్శిస్తున్నాడని, ఆయన్ను తిట్ట డం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇలాంటి రాజకీయ వ్యభి చారి ఇంకెవరైనా ఉన్నారా..!?’’ అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తీరు గమ నిస్తే ఆయన మానసిక స్థితి సరిగా లేదనే అనుమానాలు కలుగుతున్నా యన్నారు. మొన్న ఎస్పీని తిట్టారు, ఆ తరువాత కలెక్టర్‌ను తిట్టారు, ఇలా ఆయన రోజు ఎవరో ఒకరిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం చూ స్తే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. 

Updated Date - 2020-05-10T07:30:36+05:30 IST