వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-05-30T11:05:40+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా సీఎం జగన్మోహన్‌రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని పరిశ్రమల

వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి

మంత్రి గౌతం రెడ్డి


నెల్లూరు(వైద్యం), మే 29 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా సీఎం జగన్మోహన్‌రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో జరుగుతున్న మన పాలన - మీ సూచన మేధోమథనంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, పథకాలపై సదస్సు జరిగింది. మంత్రి మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ ఆశా, అంగన్‌వాడీల ద్వారా వైద్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు నిర్వహించే ఆరోగ్య శిబిరాల్లో అధునాతన వైద్య పరికరాలు వినియోగిస్తూ, నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలన్నారు. వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాలని కోరారు. ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 9వేల మంది సిబ్బందిని వైద్య శాఖలో నియమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శేషగిరిబాబు, జేసీ ప్రభాకర్‌, వైద్య శాఖ జేడీ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T11:05:40+05:30 IST