ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం ప్రార్థనలు

ABN , First Publish Date - 2020-08-22T10:24:51+05:30 IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ శుక్రవారం నెల్లూరులోని స్వతంత్ర పార్కు వద్ద కేతా అంకులు

ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం ప్రార్థనలు

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), ఆగస్టు 21 : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ శుక్రవారం నెల్లూరులోని స్వతంత్ర పార్కు వద్ద కేతా అంకులు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కళాకారులు ప్రార్థనలు చేశారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షుడు జయప్రకాష్‌ మాట్లాడుతూ భాషాబేధం లేకుండా మూడు తరాల కళాకారులకు పాటలు పాడిన గొప్ప కళాకారుడు బాలసుబ్రహ్మణ్యం అన్నారు.


ఆయన ఆరోగ్యంపై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల పాలకులు చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా పేద కళాకారులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, సర్వేపల్లి రామ్మూర్తి, సురభి రాజశేఖర్‌, రమేష్‌, అనురాధ, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-22T10:24:51+05:30 IST