‘తిరుపతి’ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధిస్తాం

ABN , First Publish Date - 2020-10-12T18:02:11+05:30 IST

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో..

‘తిరుపతి’ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధిస్తాం

తిరుపతి(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తిరుపతిలో ఆదివారం జరిగిన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ ఇన్‌చార్జులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కక్షపూరితంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. వైసీపీ దాడులకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వలంటీర్ల ద్వారా గ్రామాల్లో అరాచకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై దాడులు చేయడం ఏ దేశంలోనూ చూడలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిస్థితులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కమిటీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే దళితులపై దాడులు జరుగుతు న్నాయన్నారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్త ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యేలు సుగుణ, హేమలత, రామకృష్ణ, పాశం సునీల్‌లను సోమిరెడ్డి సత్కరించారు. శ్రీధర్‌వర్మ, రవికుమార్‌ యాదవ్‌, జేడీ రాజశేఖర్‌, ఆనంద్‌గౌడ్‌, బ్యాంకు శాంతమ్మ, మునిశేఖర్‌ రాయల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-12T18:02:11+05:30 IST