అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-11-28T04:31:49+05:30 IST

తుఫాన్‌ కారణంగా వరద ముప్పు పొంచి ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

 మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 27 : తుఫాన్‌ కారణంగా వరద ముప్పు పొంచి ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. సోమశిల జలాశయం నుంచి భారీగా వరద వస్తుండటంతో పెన్నానది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోందని, ఇప్పటికే పలుచోట్ల పొర్లుకట్ట లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని, వరదతో నిరాశ్రయులైన వారికి ఆహారం, ఆర్థిక సాయం అందించాలని కోరారు. రైతులకు ఉచితంగా విత్తనాలను అందించడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Read more