-
-
Home » Andhra Pradesh » Nellore » somasila water flow problem
-
ఉపకాలువకు నీరందక అవస్థలు
ABN , First Publish Date - 2020-12-28T04:47:38+05:30 IST
సోమశిల ఉత్తర కాలువ పరిధిలోని 13ఆర్ ఉపకాలువకు నీరు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

అనంతసాగరం, డిసెంబరు 27: సోమశిల ఉత్తర కాలువ పరిధిలోని 13ఆర్ ఉపకాలువకు నీరు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కాలువ పరిధిలో సుమారు 150 ఎకరాల్లో వరిసాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కాలువకు నీరు సక్రమంగా సరఫరా కావటం లేదని ఆవేదన చెందుతున్నారు. వ్యవసా య పనులకు ఇబ్బందులు పడుతున్నామని లింగంగుంట రైతులు చెబు తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి 13ఆర్ ఉపకాలు వకు నీరు సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు.