-
-
Home » Andhra Pradesh » Nellore » somasila visit
-
దెబ్బతిన్న కట్టడాలు పూర్తి చేసేలా చర్యలు
ABN , First Publish Date - 2020-12-16T04:27:00+05:30 IST
సోమశిల జలాశయం ముందు ఇటీవల వరదతో దెబ్బతిన్న కట్టడాలను తిరిగి నిర్మించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు

ఇన్‌చార్జి సీఈ హరినారాయణరెడ్డి
సోమశిల జలాశయం పరిశీలన
అనంతసాగరం, డిసెంబరు 15: సోమశిల జలాశయం ముందు ఇటీవల వరదతో దెబ్బతిన్న కట్టడాలను తిరిగి నిర్మించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఇన్‌చార్జి సీఈ హరినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్‌ఈ కృష్ణారావుతో కలసి సోమశిల జలాశయం ముందు వరద తాకిడితో ధ్వంసమైన ఆఫ్రాన్, స్టిల్లింగ్ బేసిన్, డౌన్‌స్టీమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జలాశయాన్ని నిపుణుల కమిటీ సందర్శించి చేపట్టనున్న పనుల వివరాలు అందిస్తారని, భవిష్యత్తులో కట్టడాలు దెబ్బతినకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్లకు సూచనలు చేశారు.
1200 మెగా వాట్లతో పవర్ ప్లాంట్: ఎస్‌ఈ
సోమశిల జలాశయం నీటిని వినియోగించి 1200 మెగా వాట్లతో కరెంటు ఉత్పత్తి చేసేలా పవర్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సోమశిల ఎస్‌ఈ కృష్ణారావు తెలిపారు. ఈ ప్రాజెక్టు నెడ్‌క్యాప్ సంస్ధ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జలాశయానికి అనుసంధానంగా ఎడమ వైపు ఈ ప్లాంట్ నిర్మించేలా స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. అనువైన ప్రాంతం గుర్తించాక ఈ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. వారి వెంట డీఈ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.