జేవీవీ ఆధ్వర్యంలో సూర్యగ్రహణ వీక్షణం

ABN , First Publish Date - 2020-06-22T10:39:15+05:30 IST

స్థానిక పోలేరమ్మ అరుగు సెంటర్‌ వద్ద ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానికులు సోలార్‌ ఫిల్టర్ల

జేవీవీ ఆధ్వర్యంలో సూర్యగ్రహణ వీక్షణం

ఉదయగిరి రూరల్‌/ఆత్మకూరు/వరికుంటపాడు/కలిగిరి, జూన్‌ 21: స్థానిక పోలేరమ్మ అరుగు సెంటర్‌ వద్ద ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానికులు సోలార్‌ ఫిల్టర్ల ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షించారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయన్నారు.


వరికుంటపాడు, జి.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి గ్రామాల్లోనూ జేవీవీ ఆధ్వర్యంలో వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలిగిరిలో పలువురు ఎక్స్‌రే ఫిల్మ్‌ల ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. ఆత్మకూరులో విద్యార్థులు  వివిధ రకాల ఫిల్మ్‌ల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని తిలకించారు. జేఆర్‌పేటలో ఆది ఆంధ్ర పాఠశాల హెచ్‌ఎం లక్కు కృష్ణప్రసాద్‌, జనవిజ్ణాన నాయకులు సూర్యగ్రహణ వీక్షణ నిర్వహించారు.

Updated Date - 2020-06-22T10:39:15+05:30 IST