సముద్ర తీరంలో అస్థిపంజరం

ABN , First Publish Date - 2020-12-11T04:29:48+05:30 IST

సముద్రం ఒడ్డున అస్తి పంజరం కనిపించడం కలకలం సృష్టించింది.

సముద్ర తీరంలో అస్థిపంజరం
కొట్టుకువచ్చిన అస్థి పంజరం

వాకాడు, డిసెంబరు 10: సముద్రం ఒడ్డున అస్తి పంజరం కనిపించడం కలకలం సృష్టించింది. దుగరాజపట్నం పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం సమీపంలోని సము ద్రపు ఒడ్డుకు  గురువారం  అస్తిపంజరం కొట్టుకువచ్చింది. స్థానిక మత్స్యకారులు సమాచారం అందించడంతో ఎస్సై భోజ్యా నాయక్‌ అక్కడికి చేరుకుని అస్థిపంజరాన్ని బాలిరెడ్డిపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-12-11T04:29:48+05:30 IST