ఇంటర్‌ పరీక్షల్లో ఆరుగురి డీబార్‌

ABN , First Publish Date - 2020-03-12T09:36:35+05:30 IST

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సవ విద్యార్థులకు బుధవారం జరిగిన మ్యాథ్స్‌ 2ఏ, బోటనీ, సివిక్స్‌-2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. పరీక్షలు

ఇంటర్‌ పరీక్షల్లో ఆరుగురి డీబార్‌

585 మంది గైర్హాజరు 


నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), మార్చి 11 : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సవ విద్యార్థులకు బుధవారం జరిగిన మ్యాథ్స్‌ 2ఏ, బోటనీ, సివిక్స్‌-2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. పరీక్షలు ప్రారంభమైన తరువాత ఇంత మంది విద్యార్థులు డీబార్‌ కావడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 87 పరీక్ష  కేంద్రాల్లో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన పరీక్షల్లో బిట్రగుంటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ఇద్దరు ఒకేషనల్‌ విద్యార్థులు, మర్రిపాడు జూనియర్‌ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు, సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థి, వెంకటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థి వెరసి ఆరుగురు మాల్‌ ప్రాక్టీ్‌సకు పాల్పడుతుంటే అధికారులు గుర్తించి డీబార్‌ చేశారు.


ఆర్‌ఐవో శ్రీనివాసులు రెండు కేంద్రాలను తనిఖీ చేయగా, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 27 సెంటర్లను తనిఖీ చేశారు. ఈ పరీక్షకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు జనరల్‌ విభాగంలో 24,699 మందికిగాను 24,135 మంది,  ఒకేషనల్‌ విభాగంలో 921 మందికిగాను 900 మంది వెరసి 25,620, మంది విద్యార్ధులకుగాను 25,035 మంది హాజరయ్యారు. 585 మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2020-03-12T09:36:35+05:30 IST