శివ పూజకు వేళాయె
ABN , First Publish Date - 2020-11-16T04:11:14+05:30 IST
దట్టమైన వెలిగొండ అటవీ ప్రాంతం, ఎటుచూసినా ఎత్తయిన కొండలు, దుమికే జలపాతాలు, పారే సెలయేళ్లు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రముఖ శైవక్షేత్రాలు ఘుటిక సిద్ధేశ్వరం, భైరవకోన. కార్తీక మాసం వచ్చిదంటే చాలు ఈ క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది.

ముస్తాబైన శైవక్షేత్రాలు...
నేటి నుంచి కార్తీక సోమవారం పూజలు
ఉదయగిరి రూరల్, నవంబరు 15: దట్టమైన వెలిగొండ అటవీ ప్రాంతం, ఎటుచూసినా ఎత్తయిన కొండలు, దుమికే జలపాతాలు, పారే సెలయేళ్లు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రముఖ శైవక్షేత్రాలు ఘుటిక సిద్ధేశ్వరం, భైరవకోన. కార్తీక మాసం వచ్చిదంటే చాలు ఈ క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాల్లో హరిత శోభ నెలకొంది. ఈ క్షేత్రాల్లో ఈ నెల 16 (నేటి) నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాసం వేడుకలు జరగనున్నాయి. ఈ శైవక్షేత్రాలకు నెల్లూరు జిల్లాతోపాటు కడప, ప్రకాశం జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు తరలివస్తుంటారు. ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలతోపాటు వచ్చిన భక్తులకు నిత్యన్నదానం నిర్వహిస్తుంటారు. వీటితోపాటు జిల్లాలోని శైవక్షేత్రాలన్నింటిలోనూ సోమవారం నుంచి కార్తీక సోమవారం పూజలు జరగనున్నాయి. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.