కదిలిన మానవీయం..!

ABN , First Publish Date - 2020-03-29T11:20:35+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు, పిడికెడు మెతుకులు కరువైన యాచకులకు

కదిలిన మానవీయం..!

నెల్లూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు, పిడికెడు మెతుకులు కరువైన యాచకులకు పలువురు దాతలు ఆపన్న హస్తం అందించారు. అలాగే రాజకీయ నాయకులు  కూడా ప్రజలకు కూరగాయలు, మాస్కులు, సబ్బులు పంచిపెట్టారు. 

నెల్లూరులోని వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో బీజేపీ నాయకుడు పూందమల్లి మల్లికార్జున  అనాధలకు అన్నదానం చేశారు. 48వ డివిజన్‌లో ఎస్‌కే సిద్ధిక్‌, రొడ్డా శ్రీనివాసులు పేదలకు అన్నదానం చేశారు. మనస్సాక్షి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ చిల్లర మధు, సభ్యులు సంగీ శ్రీనివాస్‌, పత్తి మల్లికారుజన, సురేష్‌బాబులు ఆహార పొట్లాలు, మజ్జిగ , తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. 


వైసీపీ మైనార్టీ నాయకులు, రోటరీ క్లబ్‌ సౌత్‌, ఏసీ కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు సంయుక్తంగా నగరంలోని విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు, స్వర్ణదీపం చారిటబుల్‌ ట్రస్టులో దివ్యాంగులకు, రోడ్డు పక్కన ఉన్న పేదలకు, బిచ్చగాళ్లకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 


కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్టు తరపున కరోనా నివారణకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.5 లక్షలు విరాళాన్ని తహసీల్దారుకు అందచేశారు. కోవూరులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 

బుచ్చిరెడ్డిపాళెంలో పేదలకు సబ్బులు, బిస్కెట్లు, ఆహార పొట్లాలను పలువురు అందచేశారు. 

కొడవలూరులో టీ కృష్ణ ఆధ్వర్యంలో మాస్క్‌లు పంపిణీ చేశారు. 

వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీ రైతులు 50 పుట్ల ధాన్యం అందజేశారు

మనుబోలు మండలం కాగితాపూర్‌ రోడ్డు వద్ద ఎల్‌ఎన్‌ఎంపురం గ్రామానికి చెందిన చిరుమావిళ్ల రామసుబ్బానాయుడ సబ్బులు, మాస్క్‌లు, శానిటైజర్లు, ఆహార పొట్లాలు అందచేశారు. 

మనుబోలులో పోలీసులకు, లారీ డ్రైవర్లకు, వృద్ధులకు పులిహార ప్యాకెట్లు అందచేశారు. 


గూడూరులో  సాయిసత్స్యంగ నిలయం, శ్రీలక్ష్మీ చారిటబుల్‌ ట్రస్ట్‌, అబ్దుల్‌ కలామ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఆహార పొట్లాలు, మజ్జిగ పాకెట్టు పంపిణీ చేశారు. శ్రీకంటి రామ్మోహన్‌రావు మాస్క్‌లు, శ్యానిటైజర్లు ఇచ్చారు. 

కోటలో జలీల్‌బాషా, తూపిలి రాధాకృష్ణారెడ్డిలు కోట పరిసర ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశారు. 

వెంకటగిరిలో కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి మాస్క్‌లు ,శ్యానిటైజర్లు పంపిణీ చేశారు. 


డక్కిలి మౌనిక చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.  


కావలిలో బీజేపీ నాయకులు నిత్యవసర సరుకులు, ఆహార పొట్లాలు, మాస్కులు పంపిణీ చేశారు. పోలీసులకు, యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కావలిలో వైవీఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసాద్‌ కావేరిగుంట గిరిజనులకు ఆహారపొట్లాలు అందజేశారు. 26వ వార్డులో ప్రతి ఇంటికి మాస్కులు, సబ్బులు అందజేశారు


కలిగిరి, కొండాపురంలో రెడ్‌ క్రాస్‌ సభ్యులు మాస్కులు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంఘాలు యాచకులకు అల్పాహారం అందజేశారు.

వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీలో గిరిజనులకు విశ్రాంత ఉపాధ్యాయుడు రామ్మూర్తి ఆహార పానీయాలు అందజేశారు. ఆత్మకూరు ఆది,పర్వీన్‌ ప్రెండ్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో పండ్లు, పెరుగన్నం అందజేశారు. 

ఉదయగిరి, వింజమూరులలో మల్లాల కొండారెడ్డి, జగదీష్‌, టీచర్‌ బి.సి. చెన్నయ్యలు అన్నదానం చేశారు. 


నాయుడుపేట: 

ఎమ్మెల్యే సూచనల మేరకు కట్టాసుధాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డిలు తొమ్మూరు ఇందిరాగాంధీ కాలనీ, చంద్రబాబు కాలనీ, సంజయ్‌ గాంధీ కాలనీ, అగ్రహారపేటలో కటకం జయరామయ్య, దారా రవిలు కూరగాయలు పంపిణీ చేశారు. 

సూళ్లూరుపేటలో వినాయకగుడి పూజారి రమణస్వామి భోజనం పాకెట్లు పంపిణీ చేశారు. స్నేహ కిరణాలు బృందం భోజనం పాకెట్లు పంచి పెట్టింది.


Updated Date - 2020-03-29T11:20:35+05:30 IST