రూ 10 లక్షలు విలువ చేసే మద్యం గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-29T03:58:33+05:30 IST

కలువాయి మండలంలోని వెరుబొట్లపలి ్లలో సోమవారం రాత్రి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి ఆద్వర్యంలో అధికారులు దాడులు చేసి కర్ణాటక మద్యం, నిషేదిత గుట్కాలు స్వాధీనం చేసుకొన్నారు.

రూ 10 లక్షలు విలువ చేసే మద్యం గుట్కా స్వాధీనం
పట్టుబడిన మద్యం, గుట్కాతో అధికారులు

 కలువాయి, డిసెంబరు 28.  కలువాయి మండలంలోని వెరుబొట్లపలి ్లలో సోమవారం రాత్రి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి ఆద్వర్యంలో అధికారులు దాడులు చేసి కర్ణాటక మద్యం, నిషేదిత గుట్కాలు స్వాధీనం చేసుకొన్నారు.గ్రామానికి చెంది న ఎ.వెంకటేశ్వర్లు అతని కుమారుడు రవితేజకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించగా, సుమారు నాలుగు లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం, బారీగా గుట్కా, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు పట్టుబడిన సరుకుల విలువ సుమారు రూ 10 లక్షలు ఉంటుందని అదికారులు తెలిపారు. వారు వినియోగిస్తున్న బొలెరో వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. తండ్రి కొడుకును అదుపులోకి తీసు కున్నట్లు తెలిపారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్సీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ అక్రమ మద్యం విక్రయిస్తుంటే వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈదాడుల్లో సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు సీఐలు బాలకృష్ణ, శ్రీనివాసులు కలువాయి ఎస్‌ఐ ఆంజనేయులు పాల్లొన్నారు

Updated Date - 2020-12-29T03:58:33+05:30 IST