-
-
Home » Andhra Pradesh » Nellore » satyasodhana book released
-
సత్యశోధన గ్రంథ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-12-31T03:57:45+05:30 IST
శ్రీహరికోట స్పేస్ సెంటర్ స్కూల్ హిందీ ఉపాధ్యాయుడు మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు ఐనాపురపు రామలింగేశ్వరరావు అనువదించిన సత్యశోధన అనే గ్రంథాన్ని బుధవారం భారత పిరమిడ్‌పార్టీకి చెందిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ అవిష్కరించారు.

సూళ్లూరుపేట, డిసెంబరు 30 : శ్రీహరికోట స్పేస్ సెంటర్ స్కూల్ హిందీ ఉపాధ్యాయుడు మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు ఐనాపురపు రామలింగేశ్వరరావు అనువదించిన సత్యశోధన అనే గ్రంథాన్ని బుధవారం భారత పిరమిడ్‌పార్టీకి చెందిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ అవిష్కరించారు. హైదారాబాదులో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. షార్‌కు చెందిన డాక్టర్ నాగవేణిశంకర్ తెలుగులో రచించిన సత్యశోధన గ్రంథాన్ని ఐనాపురపు రామలింగేశ్వరరావు హిందీలోకి అనువదించి ప్రచురించారు. విక్రీశాట్ విశ్రాంత శాస్త్రవేత్త ఆవంచ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. షార్ శాస్త్రవేత్తలు, రచయితలు, కళాకారులు అభినందనలు తెలిపారు.