నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-29T10:55:38+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే  లక్ష్యం

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి


వెంకటాచలం, మే 28 : సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  అన్నారు. గురువారం వెంకటాచలం, చెముడుగుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు. అనంతరం కంటేపల్లి గ్రామంలో రూ.77 లక్షలతో నిర్మించనున్న సచివాలయ భవనం, రైతు భరోసా, ఆరోగ్య ఉప కేంద్రాలు, రూ.70 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.  రూ.40 లక్షలతో  నిర్మించిన డ్రైనేజ్‌ పనులు, రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. నాడు - నేడు కింద గిరిజన కాలనీల్లోని పాఠశాలకు ప్రహారీ గోడ, మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. 

Updated Date - 2020-05-29T10:55:38+05:30 IST