-
-
Home » Andhra Pradesh » Nellore » sand
-
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-11-26T05:01:56+05:30 IST
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా శాండ్ అధికారి జీ.పాపారావు హెచ్చరించారు.

బాధ్యతలు చేపట్టిన జిల్లా శాండ్ అధికారి పాపారావు
నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు 25 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా శాండ్ అధికారి జీ.పాపారావు హెచ్చరించారు. జిల్లా శాండ్ అధికారిగా బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా శాండ్ అధికారిగా మైనింగ్ శాఖ ఏజీ వంశీధర్‌రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే ధీర్ఘ్గకాలిక సెలవులో ఉన్న పాపారావు తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం అందరూ రీచ్‌ల్లో ఇసుకను బుక్ చేసుకుని తీసుకెళ్లాలని తెలిపారు. బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.