కళాకారుల మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2020-12-07T04:11:25+05:30 IST

ఇటీవల మృతిచెందిన హాస్య కళాకారుడు సర్వబొట్ల సర్వబొట్ల వెంకటశేషయ్య, జానపద గాయకుడు కె.ఎన్‌.కుమార్‌ సంస్మరణ సభ నవ్యాంధ్ర కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానపద కళా

కళాకారుల మృతి తీరని లోటు
కళాకారులకు నివాళులర్పిస్తున్న ప్రజాసంఘాల ప్రతినిధులు

కావలి, డిసెంబరు 6: ఇటీవల మృతిచెందిన హాస్య కళాకారుడు సర్వబొట్ల సర్వబొట్ల వెంకటశేషయ్య, జానపద గాయకుడు కె.ఎన్‌.కుమార్‌ సంస్మరణ సభ నవ్యాంధ్ర కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానపద కళారంజని వ్యవస్థాపకుడు, కావలి ఏరియావైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కుం దుర్తి శ్రీనివాసులు, కళాసమితి కార్యదర్శి బీవీ లక్ష్మీనారాయణ, నవజ్యోతి ఆర్ట్స్‌ కార్యదర్శి డీ.రవిప్రకాష్‌, సీనియర్‌ విలేకరి జయప్రతాప్‌రెడ్డి, సాహితీ వేదిక కార్యదర్శి నల్లూరు రామకృష్ణ, శ్రీఆర్ట్స్‌ అధ్యక్షుడు యాసం కృష్ణమూ రి, సీపీఎం నాయకులు తాళ్లూరు మాల్యాద్రి, సీఐటీయూ నాయకులు జాన్‌, కళాసమితి సభ్యులు కాలిదాస్‌ విజయచంద్ర పాల్గొన్నారు.


Read more