సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్వహణ అధ్వానం

ABN , First Publish Date - 2020-12-08T01:35:32+05:30 IST

నెల్లూరు నగరంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్వహణ అధ్వానంగా ఉందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు.

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్వహణ అధ్వానం
సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును పరిశీలిస్తున్న అజీజ్‌

టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అజీజ్‌ 


నెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నగరంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్వహణ అధ్వానంగా ఉందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ విమర్శించారు. ట్యాంకు వద్ద వరద నీరు మంచి నీటిలో కలిసే ప్రమాదముందని, నీటి టెర్రిబిటీని తగ్గించడానికి ఆలమ్‌ను వాడుతారని, అయితే వాటికి ఉపయోగించే టెర్రిఫైర్స్‌ నెల రోజుల నుంచి పనిచేయడకపోవడం దారుణమన్నారు. సోమవారం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును అజీజ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నారని, ఈ క్రమంలో నెల్లూరులో తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. నీటిని నిబంధనల మేరకు శుద్ధి చేయాలని కోరారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో ఆలం, క్లోరిన్‌ శాతాన్ని తక్కువగా వాడుతున్నట్లు గుర్తించామన్నారు. కమిషనర్‌ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడి సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేని విధంగా తాగునీరు సరఫరా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్‌, సాబీర్‌ ఖాన్‌, ఆసిక్‌, సర్థాజ్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T01:35:32+05:30 IST