అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందాలి : జేసీ

ABN , First Publish Date - 2020-11-14T03:01:47+05:30 IST

అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు.

అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందాలి : జేసీ
సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ హరేందిర ప్రసాద్‌

బిట్రగుంట, నవంబరు 13: అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీలో మెరైన్‌ పోలీసు స్టేషన్‌ నిర్మాణానికి చిప్పలేరు వంతెన పక్కన ప్రభుత్వ స్థలాని ఆయన పరిశీలించారు. అనంతరం సీఆర్‌ పాలెంలో నిర్మాణంలో ఉన్న రామాలయ స్థల విషయమై తసీల్దారు బాలమురళీకృష్ణతో చర్చించారు. అనంతరం గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో మనోహర్‌, స్థానిక నేతలు విడవలూరి పవన్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాఘవేంద్ర, దశరథరామిరెడ్డి, వెంకటేశ్వర్లు, జైభీం అంబేద్కర్‌ సేవా దళ్‌ వ్యవస్థాపకుడు బత్తుల రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-14T03:01:47+05:30 IST