సచివాలయాల్లో 901 పోస్టులు భర్తీ
ABN , First Publish Date - 2020-12-15T05:31:22+05:30 IST
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 901 పోస్టులను భర్తీ చేసినట్లు జడ్పీ సీఈవో సుశీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరో 528 ఖాళీలు
జడ్పీ సీఈవో సుశీల
నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 14 : జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 901 పోస్టులను భర్తీ చేసినట్లు జడ్పీ సీఈవో సుశీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 1261 పోస్టులు ఖాళీ ఉండగా వాటి భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీనికి 54,191 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, సెప్టెంబరు 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహించామన్నారు. అర్హత సాధించిన వారి సర్టిఫికెట్లు పరిశీలించి 901 మందిని వివిధ పోస్టుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు లేనందున 528 పోస్టులు భర్తీ కాలేదని, వాటికి మళ్లీ నోటిఫికేషన్‌కు పంపడం జరిగిందన్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో 25 పోస్టులకు అభ్యర్థుల జాబితాను ఆ శాఖకు పంపామని, అర్హత కలిగిన వారిని నియమిస్తామని తెలిపారు.