తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-31T03:50:49+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం మండల టీడీపీ నాయకులతో కలసి ఆందోళన ని

తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

ముత్తుకూరు, డిసెంబరు30: నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం మండల టీడీపీ నాయకులతో కలసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు.  కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునయాదవ్‌, ఉపాధ్యక్షుడు యల్లంగారి రమణయ్య, తెలుగుయువత మండల అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, నాయకులు ఏకొల్లు కోదండయ్య, ముసునూరు రామ్మోహన్‌రెడ్డి, కాంతారావు, ఏడుకొండలు, శ్రీధర్‌రెడ్డి, ప్రసాద్‌, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T03:50:49+05:30 IST