రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు
ABN , First Publish Date - 2020-12-02T04:14:27+05:30 IST
నివర్ తుఫాను కారణంగా సత్యవోలు- సత్యవోలు అగ్రహారం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు నడుస్తాయని కావలి డిపోమేనేజర్ కే.హరి అన్నారు.

కొండాపురం, డిసెంబరు1: నివర్ తుఫాను కారణంగా సత్యవోలు- సత్యవోలు అగ్రహారం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు నడుస్తాయని కావలి డిపోమేనేజర్ కే.హరి అన్నారు. గత నాలుగురోజులుగా కావలి- కొండాపురం మధ్య బస్సులు నడవడంలేదు. ఈ మేరకు దెబ్బతిన్న రోడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోనులో సంప్రదించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం నుంచి కావలి నుంచి సత్యవోలు వరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు.