రైతుల ఆందోళనకు మద్దతుగా దీక్ష

ABN , First Publish Date - 2020-12-30T02:23:35+05:30 IST

ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం తహసీల్దారు కార్యాలయ ఆవరణ ఎదుట దీక్ష చేపట్టారు. సీపీఎం నాయకుడు గండవరపు శేషయ్య మాట్లాడు

రైతుల ఆందోళనకు మద్దతుగా దీక్ష
కోవూరులో దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులు

కోవూరు, డిసెంబరు29 :  ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం తహసీల్దారు కార్యాలయ ఆవరణ ఎదుట దీక్ష చేపట్టారు. సీపీఎం నాయకుడు గండవరపు శేషయ్య మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జి చేయడం తగదన్నారు. రైతుల పట్ల కేంద్రం అవలంభిస్తున్న వైఖరి సరిగాలేదన్నారు. ఈ దీక్షలో సీనియర్‌ న్యాయవాదులు జక్కా అశోక్‌కుమార్‌రెడ్డి, జక్కా శేషమ్మ, సీపీఎం నాయకులు మారుబోయిన సుబ్బారావు, రామయ్య, ఖాదర్‌ బాష, కాలేషా,బుజ్జయ్య పెద్దబ్బయ్య,, కొమరిగిరి శ్రీనివాసులు,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T02:23:35+05:30 IST