రోడ్డుపక్కన కార్మికుడి మృతదేహం
ABN , First Publish Date - 2020-12-30T05:21:25+05:30 IST
నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు నగరంలోని వెలగచెట్టు సంఘానికి చెందిన శ్రీనివాసన్ అలియాస్ శ్రీను(31) సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు.
నెల్లూరు(క్రైం), డిసెంబరు 29: నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు నగరంలోని వెలగచెట్టు సంఘానికి చెందిన శ్రీనివాసన్ అలియాస్ శ్రీను(31) సెంట్రింగ్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఆ యువకుడు మంగళవారం ఉదయం పనికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత విగతజీవిగా రోడ్డు పక్కన కనిపించాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ పవన్‌కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.