రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-16T02:42:48+05:30 IST

వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలో శనివారం వేకువన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

చిల్లకూరు, నవంబరు 15:  వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలో శనివారం వేకువన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.  నల్గొండ జిలా మిర్యాలగూడకు చెందిన నవీన్‌(27) సపోటా పండ్ల లోడుతో టాటామ్యాజిక్‌ వాహనంలో తిరుపతికి  వెళుతుండగా, వాహనం వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొంది.  ఈ సంఘటనలో నవీన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. టాటామ్యాజిక్‌ డ్రైవర్‌ లతీఫ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-16T02:42:48+05:30 IST