ప్రాణాలు తీస్తున్న రోడ్డు మలుపులు
ABN , First Publish Date - 2020-12-21T04:27:58+05:30 IST
గమ్యాలకు చేర్చడంలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే రోడ్ల నిర్మాణంలో వచ్చిన మలుపులు ప్రాణాలను హరిస్తున్నాయి.

పట్టించుకోని అధికారులు
వెంకటాచలం, డిసెంబరు 20 : గమ్యాలకు చేర్చడంలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే రోడ్ల నిర్మాణంలో వచ్చిన మలుపులు ప్రాణాలను హరిస్తున్నాయి. మండలంలోని వెంకటాచలం-కసుమూ రు రోడ్డు, చవటపాళెం రోడ్డు, పుంజులూరుపాడు-తిరుమలమ్మపాళెం రోడ్డు, కందలపాడు రోడ్డు, కసుమూరు- కురిచెర్లపాడు రోడ్డు, ఈద గాలి రోడ్డు, పూడిపర్తిరోడ్డు, పాలిచెర్లపాడు రోడ్డు, గొలగమూడి రోడ్డు పై ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. కురిచెర్లపాడు వీవర్స్ కా లనీ మలుపులో మూడేళ్ల క్రితం ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు మృతి చెందారు. రెండేళ్ల క్రితం కనుపూరు సమీపంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఏడాది పాలిచెర్లపాడు రోడ్డులోని వంతెన మలు పు వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.పలు ప్ర మాదాల్లో అధిక సంఖ్యలో గాయపడ్డారు. కనుపూరుకు 100 మీటర్ల దూరంలోనే మూడు మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల వద్ద కూ డా పలువురు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆటోలు బోల్తా పడ డం, గాయపడడం వంటి సంఘటనలకు లెక్కే లేవు. కంటేపల్లిలో నా లుగు మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల వద్ద కూడా ఎన్నో ప్రమా దాలు చోటుచేసుకున్నారు. ఈ మలుపుల వద్ద స్పీడు బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశముంది. ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
చర్యలు తీసుకోవాలి
ఏయే రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు చేపడితే ప్రమాదాలను నివారిం చవచ్చు అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేయాలి. ప్రమాదాల నివారణకు అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.
-ఆస్తోటి నాగారాజు, కంటేపల్లి
ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులదే
మలుపుల వద్ద జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరి కొందరు క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. అధికా రులు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకో వాలి. విలువైన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఆ దిశగా ముందుకెళ్లాలి.
షేక్ అబ్దుల్లా, వెంకటాచలం