ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు అనుమతి

ABN , First Publish Date - 2020-12-14T04:14:52+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు అనుమతి
అధ్వానంగా తయారైన అల్లీపురం రోడ్డు

రూ.8.3 కోట్లతో పనులు


నెల్లూరు(జడ్పీ),డిసెంబరు 13 : జిల్లాలో నివర్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నివర్‌ తుఫాన్‌ జిల్లాను అతలాకుతలం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి..  రోడ్లకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని,  అవసరమైన రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. గూడూరు, నెల్లూరు, కావలి డివిజన్లలో దెబ్బతిన్న రోడ్లన్నింటిని గుర్తించి అత్యవసర పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు.   ఆ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 


రూ.8.3కోట్లతో మరమ్మతులు


జిల్లాలోని గూడూరు, కావలి, నెల్లూరు డివిజన్ల పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టేందుకు రూ.8.3కోట్ల పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. గూడూరు డివిజన్‌లో 13 రోడ్లకు సంబంధించి రూ.2.92కోట్లు, నెల్లూరు డివిజన్‌లో 14 రోడ్లకు సంబంధించి రూ.2.13కోట్లు, కావలి డివిజన్‌లో 13 రోడ్లకు సంబంధించి రూ.3.25కోట్లు మొత్తం రూ.8.3కోట్ల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రెండు,మూడు రోజుల్లో ఈ పనులకు అధికారులు టెండర్లు పిలిచి, పనులు చేపట్టనున్నారు.


Updated Date - 2020-12-14T04:14:52+05:30 IST