రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని వందేళ్ల వేపచెట్టు నరికివేత

ABN , First Publish Date - 2020-12-26T03:43:03+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని పట్టణంలోని బంగ్లా వీధిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద వేప చెట్టును నరికివేశారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని వందేళ్ల వేపచెట్టు నరికివేత
నరికిన వేపచెట్టు మొద్దులు

చర్యలు తీసుకోవాలి జనసేన, బీజేపీ డిమండ్‌

కావలి, డిసెంబరు 25: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని పట్టణంలోని బంగ్లా వీధిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద వేప చెట్టును నరికివేశారు. దీనిపై స్పందించిన జనసేన, బీజేపీల నాయకులు చెట్టును నరికించిన స్థానిక నాయకుడు జీ. వెంకట చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు జనసేన కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు తోట వెంకటశేషయ్య, బీజేపీ పట్టణాధ్యక్షుడు కే.బ్రహ్మానందం శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ 30వ వార్డు బంగ్లా వీధిలో సబ్‌కోర్టు వెనుక కూడలిలో రోడ్డుపై ఉన్న 100 ఏళ్ల నాటి వేప చెట్టును నరికి పర్యావరణానికి ముప్పు కల్పించారని పేర్కొన్నారు. రోడ్ల వెంబడి ఉన్న చెట్లు ఇంటి నిర్మాణాలకు ఆటంకంగా ఉంటే మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి దానివలన ఇబ్బందులు ఉన్నట్లు మున్సిపాల్టీ వారు భావిస్తే ఆ చెట్టును వేలం వేసి వచ్చే ఆదాయాన్ని మున్సిపాల్టీకి జమ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ మున్సిపల్‌ అనుమతులు లేకుండా చట్టానికి విరుద్ధంగా తాను వైసీపీ నాయకుడినని, చట్టం తన చుట్టం అంటూ చెట్టును నరికి వేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చెట్టు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాల్టీకి జమచేయాలని చెప్పారు.

25కెవిఎల్‌8: నరికిన వేపచెట్టు మొద్దులు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని వందేళ్ల వేపచెట్టు నరికివేత

ఫ చర్యలు తీసుకోవాలి జనసేన, బీజేపీ డిమండ్‌

కావలి, డిసెంబరు 25: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుగా ఉందని పట్టణంలోని బంగ్లా వీధిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద వేప చెట్టును నరికివేశారు. దీనిపై స్పందించిన జనసేన, బీజేపీల నాయకులు చెట్టును నరికించిన స్థానిక నాయకుడు జీ. వెంకట చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు జనసేన కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు తోట వెంకటశేషయ్య, బీజేపీ పట్టణాధ్యక్షుడు కే.బ్రహ్మానందం శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ 30వ వార్డు బంగ్లా వీధిలో సబ్‌కోర్టు వెనుక కూడలిలో రోడ్డుపై ఉన్న 100 ఏళ్ల నాటి వేప చెట్టును నరికి పర్యావరణానికి ముప్పు కల్పించారని పేర్కొన్నారు. రోడ్ల వెంబడి ఉన్న చెట్లు ఇంటి నిర్మాణాలకు ఆటంకంగా ఉంటే మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి దానివలన ఇబ్బందులు ఉన్నట్లు మున్సిపాల్టీ వారు భావిస్తే ఆ చెట్టును వేలం వేసి వచ్చే ఆదాయాన్ని మున్సిపాల్టీకి జమ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ మున్సిపల్‌ అనుమతులు లేకుండా చట్టానికి విరుద్ధంగా తాను వైసీపీ నాయకుడినని, చట్టం తన చుట్టం అంటూ చెట్టును నరికి వేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చెట్టు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాల్టీకి జమచేయాలని చెప్పారు.

Updated Date - 2020-12-26T03:43:03+05:30 IST