-
-
Home » Andhra Pradesh » Nellore » rio malyadri chowdary
-
జూనియర్ కళాశాలల్లో ఆర్‌ఐవో తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-11T05:29:05+05:30 IST
నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి అకస్మిక తనిఖీలు చేపట్టారు.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 10: నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి అకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్, గొలగమూడి రోడ్డులో, ధనలక్ష్మీపురంలోని కళాశాలల్లో తనిఖీలు చేపట్టామన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు టీసీలు ఇవ్వడంలో యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని, అధికంగా ఫీజు డిమాండ్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో మాట్లాడి విద్యార్థులకు టీసీలు ఇప్పించామన్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదికను ఇంటర్‌బోర్డు రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని చెప్పారు.