-
-
Home » Andhra Pradesh » Nellore » ride on brothal house
-
బిరియాని సెంటర్ మాటున వ్యభిచారం
ABN , First Publish Date - 2020-12-29T04:16:43+05:30 IST
పట్టణంలోని మానికలవారి వీధిలో వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

కావలి, డిసెంబరు 28: పట్టణంలోని మానికలవారి వీధిలో వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్.కొండయ్య వివరాలు వెల్లడించారు. వెంగళరావు నగర్ బాలాజీవారి వీధికి చెందిన షేక్ నాగూర్‌బాషా మానికలవారి వీధిలో గత 15 ఏళ్లుగా ఏ1 బిరియాని సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. బయట బిరియాని వ్యాపారం చేస్తూ లోపల వ్యభిచార గృహం నడుపుతున్నారు. డీఎస్పీ డీ.ప్రసాద్‌కు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో సిబ్బందితో వ్యభిచార గృహంపై దాడి చేసినట్లు సీఐ చెప్పారు. నిర్వాహకుడు నాగూర్ బాషాతో పాటు విటుడు చీపినాపి వేణును అరెస్టు చేశారు. రూ.5,000 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలను విచారించి పంపారు.