మొరాయించిన సర్వర్‌

ABN , First Publish Date - 2020-11-22T04:35:20+05:30 IST

బోగోలు మండలంలోని రేషన్‌ షాపుల్లో శనివారం సరుకుల పంపిణీకి సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు అగచాట్లు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు.

మొరాయించిన సర్వర్‌
రేషన్‌ షాపుల వద్ద నిరీక్షిస్తున్న లబ్ధిదారులు

లబ్ధిదారులకు అగచాట్లు

బిట్రగుంట, నవంబరు 21: బోగోలు మండలంలోని రేషన్‌ షాపుల్లో శనివారం సరుకుల   పంపిణీకి సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు అగచాట్లు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. మండలంలో 38 రేషన్‌ షాపుల్లో అంతోదయ, అన్నపూర్ణ కార్డులతో కలసి మొత్తం 14 వేల 292 ఉన్నాయి. పడరమ పల్లెలు కన్నా తూర్పు తీర ప్రాంతాల్లో సర్వర్‌ సిగ్నెల్‌ లేక పోవడంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు రేషన్‌ కోసం వేచి ఉంటే 15 మందికి అందచేయగలిగారు. జువ్వలదిన్నెలోని రేషన్‌ షాపులో 17 మంది లబ్ధిదారులకు మాత్రమే సరుకులు ఇచ్చారు.


Read more