-
-
Home » Andhra Pradesh » Nellore » reservations are must to bcs
-
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
ABN , First Publish Date - 2020-12-28T04:11:21+05:30 IST
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వుల్లిపాయల శంకరయ్య అన్నారు.

గూడూరు(రూరల్), డిసెంబరు 27: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వుల్లిపాయల శంకరయ్య అన్నారు. ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో హనుమంతరావు, మునిరాజా, మునిరత్నం, శ్రీనివాసులు, బోయన్న తదితరులు పాల్గొన్నారు.