అన్నదాతలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T03:34:53+05:30 IST

నివర్‌, బురేవి తుఫానులతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే కిలివేటి మంత్రి గౌతమ్‌రెడ్డికి విన్నవించారు.

అన్నదాతలను ఆదుకోవాలి
మంత్రి గౌతమ్‌రెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి, నాయకులు

మంత్రికి ఎమ్మెల్యే వినతి

నాయుడుపేట, డిసెంబరు 5 : నివర్‌, బురేవి తుఫానులతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే కిలివేటి మంత్రి గౌతమ్‌రెడ్డికి విన్నవించారు. విజయవాడలో శనివారం స్థానిక నాయకులతో కలసి ఆయన మంత్రితో మాట్లాడారు. నియోజకవర్గంలో రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయన్నారు. నాయుడుపేటలో రూ.75 లక్షలతో నిర్మించనున్న సామాజిక ఆరోగ్యకేంద్ర భవనం శంకుస్థాపనకు మంత్రిని ఆహ్వానించారు.  వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలూరు దశరథరామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రాధాకిషోర్‌యాదవ్‌, సునీల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీమంత్‌రెడ్డి, జెట్టి వేణుయాదవ్‌, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T03:34:53+05:30 IST