పస్తులున్నాం - ఆదుకోండయ్యా

ABN , First Publish Date - 2020-11-28T05:04:23+05:30 IST

తుఫాను కారణంగా వారం రోజులుగా వేటకు వెళ్ళకపోవడంతో పస్తులుంటున్నామని గోవిందపల్లిపాళెం గ్రామ ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు.

పస్తులున్నాం - ఆదుకోండయ్యా

కోట, నవంబరు 27 : తుఫాను కారణంగా వారం రోజులుగా వేటకు వెళ్ళకపోవడంతో పస్తులుంటున్నామని  గోవిందపల్లిపాళెం గ్రామ ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. బకింగ్‌హాం కాలువ ఎస్కేప్‌ పొంగడంతో  ఈ గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి.  ఎంపీడీవో భవాని, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌ శుక్రవారం బోటులో గ్రామానికి వెళ్ళారు. గ్రామస్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. 

Read more