అనుమతి లేని తాత్కాలిక దుకాణాల తొలగింపు

ABN , First Publish Date - 2020-04-28T10:11:14+05:30 IST

నెల్లూరు నగరంలోని నవాబుపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు వెలుపల అక్రమంగా టెంట్లు ఏర్పాటు చేసి

అనుమతి లేని తాత్కాలిక దుకాణాల తొలగింపు

నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్‌ 27: నెల్లూరు నగరంలోని నవాబుపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు వెలుపల అక్రమంగా టెంట్లు  ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్న వారిపై ఏఎంసి చైర్మన్‌ ఎంబేటి ఏసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డులో ఇటీవల పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయించి వ్యాపారం చేయించినప్పటికీ కొంతమంది వ్యాపారులు వీరికి ఇబ్బందులు కలిగిస్తూ యార్డు బయట టెంట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసేందుకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న ఏసయ్య అక్కడకు చేరుకుని టెంట్లను తొలగింప చేశారు. నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకోవాలని, లేదంటే చర్యలు తప్పని హెచ్చరించారు.


Updated Date - 2020-04-28T10:11:14+05:30 IST